ఆరోగ్యకరమైన సమాజానికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన సమాజానికి పాటుపడాలి

Oct 7 2026 2:22 AM | Updated on Oct 7 2026 2:22 AM

● డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య

ధర్మసాగర్‌ : ఆరోగ్యకరమైన సమాజానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య సూచించారు. మంగళవారం ధర్మసాగర్‌ పీహెచ్‌సీని ఆయన సందర్శించి స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందితో కలిసి పిచ్చిమొక్కలు, చెత్తచెదారం, పరిసరాలను శుభ్రం చేశారు. అంతకుముందు ఆస్పత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి,పొడి చెత్తను వేరు చేయడం, చెత్తబుట్టల వాడకం, డ్రెయినేజీ కాల్వల నిర్వహణ, గుంతల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారులు రాజ్‌కుమార్‌, పుట్ట మహేందర్‌, అలేఖ్య, కవిత, గీత, రుచిత, శ్వేత, భారతి, సూపర్‌వైజర్‌ సులోచనతో పాటు హెల్త్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలు, నర్సింగ్‌ అధికారులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement