దుగ్గొండి: జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేయనున్నట్లు జెడ్పీ సీఈఓ వసంత తెలిపారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమం కింద మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గౌడ సంఘం కార్యాలయం, పల్లె దవాఖాన వద్ద నిర్మిస్తున్న సామూహిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లోని పాఠశాలలు, మహిళా సంఘాల కార్యాలయాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద, బస్టాండ్ సెంటర్లలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం, మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో జలసిరి కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఏపీఓ శ్రీనివాస్, ఎంపీఓ చంద్రమోహన్, ఈసీ రాజు, మల్లంపల్లి సర్పంచ్ బూర రాధిక చందూగౌడ్, దుగ్గొండి సర్ప ంచ్ కామిశెట్టి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.


