భూ రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

భూ రీసర్వేను పారదర్శకంగా నిర్వహించాలి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

రాయపర్తి: మండలంలోని కొండాపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసర్వే ప్రక్రియను అడిషనల్‌ కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. కొండాపురం గ్రామాన్ని రీసర్వే పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేయగా, గ్రామాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కారానికి భూసర్వే దోహదపడుతుందని స్పష్టం చేశారు. సర్వేను అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ కనుకుంట్ల మంజుల, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్వతగిరి మండలం జమాల్‌పూర్‌లో..

పర్వతగిరి: భూముల సమగ్ర రీసర్వే పనులను అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని జమాల్‌పూర్‌ గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియ, పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతతో, ప్రణాళిక ప్రకారం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ సర్వే, రికార్డ్స్‌ అధికారి శ్రీనివాసులు, తహసీల్దార్‌ వెంకటస్వామి, రైతులు, సర్వేయర్లు, పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement