అమరవీరుల స్తూపం వద్ద నివాళి | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల స్తూపం వద్ద నివాళి

Sep 18 2026 2:27 AM | Updated on Sep 18 2026 2:27 AM

ఖిలా వరంగల్‌: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖిలా వరంగల్‌ పడమర కోట జంక్షన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, మేర కార్పొరేషన్‌ చైర్మన్‌ వెంకట్రాజం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మీసాల ప్రకాశ్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అయూబ్‌, అదనపు కలెక్టర్లు గణేష్‌, కిశోర్‌ కుమార్‌, డీఆర్వో విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, తహసీల్దార్లు శ్రీకాంత్‌, ఇక్బాల్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ గజ్జెల శ్యామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement