అన్నారం సబ్‌స్టేషన్‌కు మంటలు | - | Sakshi
Sakshi News home page

అన్నారం సబ్‌స్టేషన్‌కు మంటలు

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

సమీపంలో పంట వ్యర్థాలు

కాలుస్తుండగా ఘటన

ఆర్పివేసిన అగ్నిమాపక,

విద్యుత్‌ సిబ్బంది, సర్పంచ్‌

పర్వతగిరి: రైతులు పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో సబ్‌స్టేషన్‌కు మంటలు వ్యాపించిన ఘటన అన్నారం గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రైతులు శుక్రవారం పంట వ్యర్థాలను కాలుస్తుండగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న పొలాలు, సబ్‌స్టేషన్‌కు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యుత్‌ సిబ్బంది, సర్పంచ్‌ గాడిపల్లి మహేందర్‌ మంటలను ఆర్పివేశారు. ఈ మంటల్లో కొన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అయ్యే తీగలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా కన్నెబోయిన మల్లయ్య రైతు పొలంలో 30 నీటి పైపలు కాలిపోయి రూ.30 వేల నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా డీఈ దానయ్య మాట్లాడుతూ వ్యవసాయ భూముల నుంచి మంటలు సబ్‌స్టేషన్‌ ఆవరణలోకి వ్యాపించాయని తెలిపారు. అందరం అప్రమత్తమై మంటలను ఆర్పివేసి రూ.2 కోట్ల నష్టాన్ని నివారించామని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఏడీఈ తిరుపతి, విద్యుత్‌ సిబ్బంది శ్రావణ్‌, పూర్ణాచారి, పోలీస్‌కానిస్టేబుల్‌ రమేశ్‌, వీరస్వామి, వినయ్‌, రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement