● వరంగల్ ఆర్వోఆర్ సర్వేకు రూ.10 కోట్లు
● కాజీపేట–ఘన్‌పూర్, 3,4వ లైన్ల
సర్వేకు రూ.0.43 కోట్లు కేటాయింపు
● రైల్వే పింక్‌బుక్ 2026–27లో వెల్లడి
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్ట్‌లకు రైల్వేశాఖ నిధులు కేటాయించినట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పింక్‌బుక్ 2026–27లో కాజీపేటకు సంబంధించిన పలు కీలక రైల్వే ప్రాజెక్ట్‌లు, సర్వేలు ప్రతిపాదించారు.
కాజీపేటకు సంబంధించిన
ప్రధాన రైల్వే సర్వేలు
సికింద్రాబాద్–కాజీపేట మధ్య డబ్లింగ్ సర్వే 85.45 కి.మీ.గాను రూ.1.71 కోట్లు, కాజీపేట–ఘన్‌పూర్ మధ్య గల 3, 4వ లైన్ల సర్వే 21.25 కి.మీ. గాను రూ.0.43 కోట్లు, కాజీపేట–బల్లార్షా మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 220 కి.మీ.గాను రూ.4.40 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య క్వాడ్రుప్లింగ్ సర్వే 234 కి.మీ.గాను రూ.4.68 కోట్లు, కాజీపేట–సికింద్రాబాద్ మధ్య కాడ్రుప్లింగ్ సర్వే 120 కి.మీ.గాను రూ.2.40 కోట్లు, వరంగల్ స్టేషన్ వద్ద రైల్ ఓవర్ రైల్ సర్వేకు రూ.రూ.10 కోట్లు, కాజీపేట– భూపాలపల్లి (హసన్‌పర్తి) వరకు కొత్త రైల్వే లైన్ సర్వే 24 కి.మీ.గాను రూ.1.60 కోట్లు, కాజీపేట వద్ద వరంగల్ దిశ నుంచి సికింద్రాబాద్ దిశకు బైపాస్‌లైన్‌తో కూడిన ఆర్‌ఓఆర్ సర్వే 38 కి.మీ.గాను రూ.75 కోట్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు.


