విద్యార్థులు అంకితభావంతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు అంకితభావంతో చదవాలి

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

డీఈఓ రంగయ్యనాయుడు

కాళోజీ సెంటర్‌: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. పదో తరగతి సాంఘిక శాస్త్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా సోషల్‌ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ సందర్భంగా డీఈఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సోషల్‌ ఫోరం నిర్వహించిన కార్యక్రమాలు మిగిలిన ఫోరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఏఎంఓ సుజన్‌తేజ, డీఎస్‌ఓ డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సోషల్‌ ఫోరం సేవాభావంతో విద్యార్థులను ప్రోత్సహిస్తోందని, సోషల్‌ సబ్జెక్టులో 100 శాతం మార్కులు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి ఉందని అభినందించారు. సోషల్‌ ఫోరం గౌరవ అధ్యక్షుడు మంగ రాజన్న, జిల్లా అధ్యక్షుడు తాటిపాముల రమేశ్‌, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి రవి, ఉపాధ్యక్షులు సాంబమూర్తి, ఉప్పల సతీశ్‌, అన్న సాంబయ్య, చిట్టిబోతుల సంపత్‌ , హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement