వీటితో సమస్యే లేదు..
మూడు నెలలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (పీఎం10) ఇలా..
గ్రేటర్ వరంగల్‌లో తగ్గుతున్న గాలి నాణ్యత
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ నగరవాసులకు వాయు కాలుష్యం టెన్షన్ పట్టుకుంది. 2025తో పోల్చుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 29 నుంచి 31 మైక్రోగ్రాముల మధ్య బాగా ఉంటే ఈ ఏడాది అది 77 మైక్రోగ్రాములకు చేరుకున్నా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. ఇది ఇలాగే కొనసాగితే ఈ ఏడాది అఖరునాటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాల (పీఎం 10) పరిమితి 100 మెక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశముంది. మడికొండలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు, లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణం, వివిధ పరిశ్రమల రాకతో ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య, వాహనాల రాకపోకలు పెరగడం ద్వారా వాటినుంచి వెలువడే ఉద్గారాలతో ఎయిర్ క్వాలిటీ దెబ్బతింటోంది. ప్రతినెలా పీసీబీ ఆధ్వర్యంలో మానిటరింగ్ చేస్తుండగా వేసవి కాలం వచ్చిందంటే పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) లెవల్స్ పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డు ఉన్న మడికొండలో మాత్రం పీఎం 10, పీఎం 2.5 పరిమితికి మించి ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజలకు తరచూ శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. చాలామంది ఆస్తమా బారిన పడుతున్న వారు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా, నగ రంలో ప్రతినెలా గాలి నాణ్యతను పరీక్షించేందుకు వరంగల్ మీ సేవ, హనుమకొండలోని కుడా ఆఫీస్, బాలసముద్రంలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫీస్, నక్కలగుట్ట ఈసేవా కేంద్రాల వద్ద శాంప్లింగ్ టెస్ట్ స్టేషన్ల ద్వారా ఎయిర్ క్వాలిటీని చెక్ చేస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏఈ సునీత తెలిపారు. నెలలో తొమ్మిదిసార్లు చెక్ చేస్తామని పేర్కొన్నారు.
మరో ఆరు స్టేషన్లు అవసరమే..
● వరంగల్, హనుమకొండలో కలిపి రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ నాలుగు స్టేషన్లు మాత్రమే ఉండగా, కీలకమైన ప్రాంతాల్లో మరో ఆరు స్టేషన్ల వరకు ఏర్పాటుచేస్తే ఏక్యూఐ సమాచారంతో అప్రమత్తమయ్యే అవకాశముంటుంది. లేదంటే నగరవాసులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశముంది. అలాగే ఓజోన్ లెవల్స్, కార్బన్ మోనాకై ్సడ్ లెవల్స్ కొలిచే యంత్రాలు ఏర్పాటు చేయాలి.
● హనుమకొండ శివారులోని చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో రెస్పిరెబుల్ డస్ట్ శాంపిలర్స్ యంత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. అందుకు సంబంధించి అక్కడ నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాలను ఇంకా అప్‌డేట్ చేయడం లేదు.
పీసీసీబీ మార్గదర్శకాల ప్రకారం పీఎం 2.5 లెవల్ 60 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ దాటితే ప్రమాదం. హనుమకొండ ‘కుడా’ ఆఫీస్‌లో జనవరిలో 19, ఫిబ్రవరిలో 18, మార్చిలో 18, వరంగల్ మీ సేవాలో జనవరిలో 26, ఫిబ్రవరిలో 21, మార్చిలో 18 మైక్రోగ్రాములు ఉండడంతో ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది లేదు.
సల్ఫర్ డైయాకై ్సడ్ (ఎస్‌ఓ 2), నైట్రోజన్ ఆకై ్సడ్ (ఎన్‌ఓఎక్స్) 80 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా.. కానీ ఎనిమిదిలోపు, 16 మైక్రోగ్రాముల్లోపు నమోదైంది. అమ్మోనియా 400 మైక్రోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ ఉండాల్సి ఉండగా 30 మైక్రోగ్రాముల లోపు ఉంది.
గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ౖపైపెకి..
ఏక్యూఐ గతేడాది 31 ఉంటే ఈసారి 77 మైక్రోగ్రాములు
ఎం 10 పరిమితి కూడా 77 మైక్రోగ్రాముల నమోదు
డంపింగ్ యార్డ్‌తో మడికొండ చుట్టుపక్కల ప్రమాదకరస్థితి


