బంకుల్లో బారులు | - | Sakshi
Sakshi News home page

బంకుల్లో బారులు

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

జిల్లాలోని పెట్రోల్‌ బంకుల్లో సోమవారం వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరత ఉందన్న సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వినియోగదారులు క్యాన్లు, డ్రమ్ములు, బాటిళ్లతో బంకులవైపు పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. కొన్ని బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టారు. ప్రస్తుతం పంట కోత యంత్రాలతో పాటు మక్కలు, వరి ధాన్యం చేరవేయడానికి, దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లకు, జేసీబీలకు, ట్రాలీలకు, ఆటోలకు డీజిల్‌ అవసరం ఎక్కువగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో వ్యవసాయ పనులు కుంటుపడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – సంగెం/ఖానాపురం/రాయపర్తి/పర్వతగిరి

క్యాన్లు, డ్రమ్ములతో

వినియోగదారుల కష్టాలు

పలు బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు

Advertisement
 
Advertisement
Advertisement