న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు. మొత్తం 153 దరఖాస్తులు రాగా అందులో రెడెన్యూ 59, పీడీ హౌసింగ్ 11, జీడబ్ల్యూఎంసీ 33, వివిధ శాఖలకు సంబంధించినవి 50 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ నాగపద్మజ, ఆర్డీఓ సుమ, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీపీఓ కల్పన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వైవీ గణేశ్‌కు వినతిపత్రం ఇస్తున్న బీఆర్‌ఎస్‌వీ నేతలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి
ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ వీ నేతలు అదనపు కలెక్టర్‌కు విన్నవించారు. బకాయిలు రాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని కోరారు.
అదనపు కలెక్టర్ వైవీ గణేశ్
ప్రజావాణిలో 153 దరఖాస్తులు


