నర్సంపేట: మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన మొక్కజొన్న నిల్వల పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ మక్కల కొనుగోళ్లలో అలసత్వం వహించకుండా వెంటవెంటనే గోడౌన్‌లకు తరలించాలన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం నర్సంపేట వ్యవసాయ మార్కె ట్ గోదాంను సందర్శించి ఇప్పటి వరకు వచ్చిన మక్కల నిల్వల భద్రతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి అనురాద, డీసీఓ నీరజ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఎం మార్కెటింగ్ సురేఖ, మార్క్‌ఫెడ్ నిరంజన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
పిల్లల భద్రత ప్రతీఒక్కరి బాధ్యత
కాశిబుగ్గ: పిల్లల భద్రత ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఐఎంఏ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పె రుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, యువతను డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ గృహాల్లోని పిల్లలకు వై ద్యపరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారా ణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, జె డ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నెక్కొండలో..
నెక్కొండ: మండలకేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం 60 వేల బస్తాల మక్కలు నిల్వ ఉన్నాయని, రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరిపిస్తామన్నారు. రైతులు రవాణా, బస్తాల భారం భరించాలని, ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.


