కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు

అమ్మవారికి భద్రపీఠ, అశ్వవాహన సేవ

హన్మకొండ కల్చరల్‌: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ముఖ్య అతిథులుగా మేయర్‌ గుండు సుధారాణి, ప్రభాకర్‌ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్‌ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వడ్నాల నరేందర్‌, ఆడెపు రవీందర్‌, బచ్చు ఆనందం, గోరంట్ల రాజు, గోరంట్ల రాజు, బేతి అశోక్‌, బత్తుల రమేశ్‌, బాబు, కుసుమ శ్యామ్‌, రాజేందర్‌, వేణు, సమ్మయ్య, కేదాసి వెంకటేశ్వర్లు, దిడ్డి రమేశ్‌, తుమ్మ అశోక్‌, వేణుగోపాల్‌, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఎరుకల కులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవర యాదగిరి, శ్రీలత దంపతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement