పరకాల: తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్స్ దుకాణాల బంద్‌ను వ్యాపారస్తులు పరకాలలో సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అగ్రో ఇన్‌పుట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులంతా బైక్ ర్యాలీ చేపట్టి బంద్‌ను విజయవంతం చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో సీతారాంపూర్ గ్రామ శివారు నుంచి పరకాల బస్ డిపో వరకు చేసట్టిన ర్యాలీలో వ్యాపారస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన వ్యాపారస్తులకు అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్‌లో మరెన్నో పోరాటాలు అవసరమని, ఇదే ఐక్యతను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.


