ఎల్కతుర్తి: మండలంలోని బావుపేటలోని విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిబ్బందిని వివరాలు అడి గారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారని, అక్కడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంపై నిర్వాహకులకు ఆయన పలు సూచనలిచ్చారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రమేశ్, నిర్వాహకులు, రైతులు ఉన్నారు.


