జీపీఎస్‌ ఆన్‌లైన్‌ విధానం ఎత్తేయాలి | - | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌ ఆన్‌లైన్‌ విధానం ఎత్తేయాలి

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

జీపీఎస్‌ ఆన్‌లైన్‌ విధానం ఎత్తేయాలి

కమలాపూర్‌: ధాన్యం కొనుగోళ్లలో జీపీఎస్‌ ఆన్‌లైన్‌ విధానం ఎత్తేసి పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని మండలంలోని గూడూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డుపై రాస్తారో కో చేశారు. అదేవిధంగా కమలాపూర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పలువురు రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్‌పర్సన్‌ తౌటం ఝాన్సీ రాస్తారోకో చేస్తు న్న రైతులను నచ్చజెప్పి న్యాయవాది బండి కళాధర్‌తో కలిసి అదనపు కలెక్టర్‌తో పాటు మార్క్‌ఫెడ్‌ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అదనపు కలెక్టర్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులు ఇచ్చిన హామీతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. కమలాపూర్‌–గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని

రైతుల రాస్తారోకో

అదనపు కలెక్టర్‌ హామీతో

ఆందోళన విరమణ

Advertisement
 
Advertisement
Advertisement