వేలేరు: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షాలతో చేతికి అందివచ్చిన వరితో పాటు కల్లాల్లోని ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం బస్తాల కిందికి నీరు వచ్చింది. కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా.. రెండు రోజుల కిందటి నుంచే కొనుగోళ్లు ప్రారంభించారని, తీరా అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ నిర్వాహకులు పరదాలివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.


