తెలంగాణ అభివృద్ధికి ప్రతీక బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి ప్రతీక బీఆర్‌ఎస్‌

Apr 28 2026 7:17 AM | Updated on Apr 28 2026 7:17 AM

తెలంగాణ అభివృద్ధికి ప్రతీక బీఆర్‌ఎస్‌

పరకాల: స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పరకాల కూరగాయల మార్కెట్‌ చౌరాస్తాలో పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎండగట్టే సత్తా కేవలం బీఆర్‌ఎస్‌కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూధన్‌రెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ బండి సారంగపాణి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు నిప్పాని సత్యనారాయణ, కొక్కిరాల రాకేశ్‌రావు, దుంపేటి నాగరాజు, బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

Advertisement
 
Advertisement
Advertisement