● మున్సిపల్ కమిషనర్ జోనా
వర్ధన్నపేట: ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచి వందశాతం అయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ జోనా అన్నారు. ఆదివారం ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటిపన్నులకు ముందస్తుగా చెల్లించే పన్నుదారులకు ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రిబేట్ ప్రయోజనాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ రిబెట్ సదుపాయం ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి పన్ను చెల్లింపులపై అవగాహన కల్పించాలన్నారు. వసూలు చేసే ప్రతీ పన్నుకు సంబంధించిన అధికారిక రశీదులు అందించాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


