వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

– 8లోu నిషేధమా.. నీవెక్కడ

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

డీఎల్‌ఎస్‌ @ 53 వసంతాలు

కాజీపేటలోని డీజిల్‌ లోకోషెడ్‌ ఇండియన్‌ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈనెల 28న 53 వసంతోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏప్రిల్‌ ఒకటిన వరంగల్‌ నగర శివారు ఏనుమాముల మార్కెట్‌ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ‘ఉమానాగ్‌ పా లిమర్స్‌’ కంపెనీపై టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సు మారు రూ.12 లక్షల విలువైన నిషేధిత ప్లాస్టిక్‌ గ్లాసులు, ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించడంతోపాటు యూనిట్‌కు నోటీసులు జారీ చేశారు.

ఏప్రిల్‌ 16న వరంగల్‌ నగర శివారు తిమ్మాపూర్‌లోని పెన్షన్‌పురలో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్‌ కలిగిన ప్లాస్టిక్‌ కవర్‌ కోటెడ్‌ పేపర్‌ ప్లేట్లు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన స్టాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ నిర్వాహకుడికి బల్దియా అధికారులు రూ.13,000 జరిమానా విధించారు.

సాక్షి, వరంగల్‌: గ్రేటర్‌ వరంగల్‌లో తక్కువ మైక్రాన్‌ కలిగిన ప్లాస్టిక్‌ గ్లాస్‌లు, ప్లాస్టిక్‌ కవర్‌ కోటెడ్‌ పేపర్‌ ప్లేట్ల తయారీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిబంధనల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా ఉత్పత్తి చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా టీ స్టాళ్లు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్‌తో తయారైన గ్లాసుల్లో వేడి పానీయాలు పోస్తే రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్‌ కవర్‌ కోటెడ్‌ పేపర్‌ ప్లేట్లలో అన్నం తినేవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ, కాలేయ సమస్యలకు దారితీసే అవకాశముంది. ప్రజలు తెలియక వాడడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్‌ గ్లాస్‌, ప్లేట్ల తయారీ పరిశ్రమలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌ విభాగం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతోంది. జరిమానాలు తక్కువగా ఉండడంతో తయారీదారులు తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. పోలీసుల దాడులతో ఇవి వెలుగులోకి వస్తుండడంతో ఈ అక్రమ తయారీ పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.

కఠిన చర్యలతోనే దందాకు అడ్డుకట్ట..

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులకు కనీస మందం (మైక్రాన్‌)ను నిర్దేశించింది. అయితే 40 నుంచి 50 మైక్రాన్ల లోపు ఉండే పలుచని ప్లాస్టిక్‌తో గ్లాస్‌లు, ప్లేట్లు తయారు చేయడం చట్టవిరుద్ధం. తక్కువ ఖర్చుతో భారీ లాభాలు వస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిన ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా.. నగరంలోని పరిశ్రమల్లో చిన్న యూనిట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు ఇతర ఉత్పత్తులు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్‌లు, ప్లేట్ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త్తలు డిమాండ్‌ చేస్తున్నారు. భారీ జరిమానా, యంత్రాల స్వాధీనం, లైసెన్స్‌ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్‌ పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Advertisement
 
Advertisement
Advertisement