హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

నేటి నుంచి పది రోజుల పాటు

కార్యక్రమాలు

ముస్తాబైన ఆలయం..

తరలిరానున్న భక్తజనం

మంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదా య ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఈఓ వీరస్వామి తెలిపారు. వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు.

అంకురార్పణతో జాతర ప్రారంభం

హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్‌ పుణ్యాహ వాచన, ఉత్సవ మూర్తులకు స్నపనం, తిరువంజ నం(అభిషేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్‌ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement