వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం 1989–90 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీ య సమ్మేళనం వైభవంగా నిర్వహించుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన స్నేహితులతో ప్రాంగణం అంతా పండుగ వాతావరణంగా మా రింది. ముందుగా తమకు విద్యాబోధన చేసిన గు రువులను ఆహ్వానించి వారిని శాలువాలు పూలమాలలతో సన్మానించారు. పూర్వ విద్యార్థులందరూ ఐక్యంగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకో వాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.


