ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

నర్సంపేట: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ ఈదురు వెంకన్న అన్నారు. నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేట గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈదురు వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్‌ రెడ్డిలు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేసిందని, రేవంత్‌రెడ్డి సర్కార్‌ సమస్యల పరిష్కానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వేముల రవి, మోహన్‌, రంగయ్య, నాయకులు బూర సుమన్‌గౌడ్‌, గంగిడి సాంబిరెడ్డి, మోరాల మోహన్‌రెడ్డి, బీసీ సంఘాల నాయకులు శ్రీనివాస్‌గౌడ్‌, డాగ్యాల శ్రీనివాస్‌, నర్సంపేట జర్నలిస్టులు అబ్బు వెంకట్‌రెడ్డి, వంచ రాజేందర్‌రెడ్డి, కుండె సురేష్‌, ఊరటి రాజు, మేర్గు రాము, ఎర్రబెల్లి విద్యాసాగర్‌, నల్ల వంశీధర్‌రెడ్డి, సంగినేని ప్రశాంత్‌, సౌడారపు మధు, సత్య కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement