అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

వరంగల్‌ ఎంపీ కడియం కావ్య

ధర్మసాగర్‌: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్‌ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అంతకుముందు పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ కడియం కావ్యకు సర్పంచ్‌, గ్రామ పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్‌ తోట నాగరాజు, ఉప సర్పంచ్‌ ప్రవీణ్‌, గ్రామ అధ్యక్షుడు భిక్షపతి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement