వరంగల్ స్పోర్ట్స్: సైక్లింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్‌లో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడిగా హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్, పర్యవేక్షక్షుడిగా తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యుడు వేణుగోపాల్, ఒలింపిక్స్ సంఘం బాధ్యుడు దుపాకీ సంతోష్ వ్యవహరించారు. 2026 నుంచి 2030 వరకు కొనసాగే కమిటీ వివరాలను పరిశీలకులు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్‌గా బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అధ్యక్షుడిగా ఆడెపు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా ఐత కిషన్, కోశాధికారిగా గద్దల అనిల్, ఉపాధ్యక్షులుగా జె.రమేశ్, ఆదిరెడ్డి, మట్టెడ కుమార్, తుపాకుల రవి, తీగల సాధన్, సంయుక్త కార్యదర్శులుగా కోట సునీల్, సంగల ప్రణీత్, బొచ్చు రాకేశ్, ఎం.రాజు, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా వైదుగుల శ్రీనివాస్‌రెడ్డి, థామస్, కల్పన, సుధాకర్, సంపత్, నాగరాజు, కుమారస్వామి, శంకర్, రాజు, సంతోష్ ఎన్నికై నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియముందు జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాశ్‌యాదవ్ హాజరై మాట్లాడారు. జూలైలో సబ్‌జూనియర్, సెప్టెంబర్‌లో జూనియర్, డిసెంబర్‌లో సీనియర్ విభాగాల జిల్లాస్థాయి పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసోసియేషన్ నూతన కార్యదర్శి ఐత కిషన్ మాట్లాడుతు సైక్లింగ్ క్రీడలో తెలంగాణలోనే హనుమకొండ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని అన్నారు.


