భీమదేవరపల్లి: ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి వేముల శ్రీనివాసులు, రామ్‌కీ పౌండేషన్ ప్రెసిడెంట్ యం.వి.రామిరెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. ఈసందర్భంగా సంఘం కార్యకలాపాలను పరిశీలించారు. సభ్యులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. సంఘ జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి సంఘం ద్వారా రైతులకు, సభ్యులకు అందిస్తున్న రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. సంఘం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన వారు, ఇలాంటి సహకార సంస్థలు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, సుద్దాల సంపత్ తదితరులున్నారు.
సీఎం ప్రత్యేకాధికారి వేముల శ్రీనివాసులు
ముల్కనూరు సంఘం సందర్శన


