మక్కల కొనుగోళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లలో వేగం పెంచండి

Apr 26 2026 5:09 AM | Updated on Apr 26 2026 5:09 AM

మక్కల కొనుగోళ్లలో వేగం పెంచండి

అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

ఎల్కతుర్తి: మక్కల కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అడిషనల్‌ కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని, మక్కలు కొన్న వెంటనే లారీల్లో గోదాంకు తరలించాలన్నారు. టర్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సంతాజీ, తహసీల్దార్‌ ప్రసాద్‌రావు, ఎంపీడీఓ విజయ్‌కుమార్‌, తదితర సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement