● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0 నిర్వహించినట్లు సీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఇందులో 2024 , 2025 సంవత్సరాల్లో 3,567 మంది నిందితులు అరెస్టయ్యారని, వీరిలో వరంగల్ కమిషనరేట్‌కు చెందిన 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పర్వతగిరిలో ఒకరు, సంగెంలో ఇద్దరు, సుబేదారిలో ఒకరు, హనుమకొండలో ఇద్దరు, నర్సంపేటలో ఒకరు, కాజీపేటలో ఒకరు, నర్మెటలో ఒకరు ఉన్నట్లు వివరించారు. నిందితులు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చట్టబద్ధంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలు, మోసాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం రిపోర్టింగ్ ప్లాట్‌ఫారంకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు.


