న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఖానాపురం: పర్యాటక ప్రాంతాల్లో పాకాలకు ప్రత్యేక స్థానం. సరస్సు అందాలు, ఆహ్లాద వాతావరణం, పక్షులు, జంతువుల సందడితో మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. చిన్నారులకు ఆటవస్తువులు, పర్యాటకులకు బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ.. అభివృద్ధి పనులతో పాకాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. మండలంలోని అశోక్‌నగర్ శివారులో పాకాల పర్యాటక ప్రాంతం ఉంది. 30.3 ఫీట్లతో నీటిమట్టం, 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అటవీ ప్రాంతానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. సరస్సు అందాలు, పక్షులు, జంతువుల సందడి, లీకేజీ నీటిలో జలకాలాడుతూ ఆనందంగా గడుపుతుంటారు. ప్రతీ సంవత్సరం పాకాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, ఎఫ్‌ఆర్వో పుప్పాల రవికిరణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆటవస్తువులు, బోటింగ్, బటర్‌ఫ్‌లై గార్డెన్ అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.
పాకాలలో ఏర్పాట్లు చేస్తున్న
అటవీ శాఖ అధికారుల
త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు
పర్యాటకులకు అందుబాటులో
ఉంచిన రెండు జీప్‌లు
రెండు గంటలకు రూ.1500 చార్జ్


