● జిల్లా న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ
వర్ధన్నపేట: పట్టణానికి మంజూరైన మున్సిఫ్ కోర్టు భవనం రెనోవేషన్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని జిల్లా న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ అన్నారు. మున్సిఫ్‌కోర్టు కార్యకలాపాలకు ఎంపిక చేసిన పాత మున్సిపల్ కార్యాలయ రెనోవేషన్ పనులను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ లీగల్ సెల్ కార్యదర్శి నిమ్మాని శేఖర్‌రావు మాట్లాడుతూ మున్సిఫ్‌కోర్టుకు పాత మున్సిపాలిటీ భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంపిక చేశారని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెనోవేషన్ పనులకు కలెక్టర్ సత్యశారద రూ.22.5 లక్షల నిధులు మంజూరుచేయగా.. టెండర్ పక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. మూడు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని కేసులు మున్సిఫ్‌కోర్టులో నిర్వహిస్తారని ఆయన వివరించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ జోనా, తహసీల్దార్ విజయసాగర్, కౌన్సిలర్లు పాపారావు, తిరుపల్లి వాణి కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


