● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నైపుణ్యాభివృద్థితో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐదో రోజు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్‌న్స్ హాల్‌లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు సులభంగా పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత నైపుణ్య అవకాశాలు పెంపొందించుకునే విధానాన్ని సీనియర్ ప్రొఫెసర్ నవీన్ వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నుంచి గణేశ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రతినిధి మురళి వేస్ట్ మెటీరియల్ నుంచి విలువైన మెటీరియల్ ఎలా తయారు చేయాలో వివరించారు. అనంతరం యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 8న నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, సంక్షేమ శాఖల అధికారులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.


