పల్లకీసేవ.. చతుస్థానార్చన | - | Sakshi
Sakshi News home page

పల్లకీసేవ.. చతుస్థానార్చన

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

హన్మకొండ కల్చరల్‌ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పల్లకీసేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన జరిపారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు.

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్‌ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్‌ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తాన్నారు.

రిజిస్ట్రార్‌కు ఏబీవీపీ వినతి

పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్‌, బాధ్యులు మేరుగు సాయి, అఖిల్‌ రిజిస్ట్రార్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement