లెక్కాపత్రం లేకపోతే ఎలా? | - | Sakshi
Sakshi News home page

లెక్కాపత్రం లేకపోతే ఎలా?

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

వరంగల్‌ అర్బన్‌: హనుమకొండ ప్రాంతంలోని పలు డివిజన్ల నుంచి వెలువడుతున్న తడి, పొడి చెత్త సేకరణలో లెక్కాపత్రం లేకపోతే ఎలా? అంటూ మేయర్‌ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్‌ వెహికిల్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్‌ తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. నగరంలో తడి, చెత్త సేకరణ పరిమాణాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. చెత్త వర్గీకరణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను వేరు చేసి సేకరించే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని కోరారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు.

మేయర్‌ గుండు సుధారాణి

బాలసముద్రం సెకెండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ తనిఖీ

Advertisement
 
Advertisement
Advertisement