శంకర్‌గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
హన్మకొండ: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్‌లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్‌లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు.


