పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు | - | Sakshi
Sakshi News home page

పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

దుగ్గొండి/నెక్కొండ: కుటీర పరిశ్రమల స్థాపన కోసం ప్రతి మహిళా పొదుపు సంఘం రూ.కోటి రుణం తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలోని చాపలబండ, నెక్కొండ మండలంలోని అప్పల్‌రావుపేటలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గిర్నిబావి శివారులో త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలందిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని నిధులతో అప్పల్‌రావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దుగ్గొండి తహసీల్దార్‌ ముస్కు సమ్మక్క, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఓ రమేశ్‌, చాపలబండ సర్పంచ్‌ అల్లాటి ప్రభు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సంధ్య, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రావుల హరీశ్‌రెడ్డి, ఏపీఎం రాపాక కిరణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్‌ పాల్గొన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement