సమయపాలన పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించాలి

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

వేలేరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని సిబ్బంది హాజరు, రికార్డులు, మందులు, ల్యాబ్‌ రూం, ఓపీ సేవల్ని పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, ఎన్‌సీడీ, ఏఎన్‌సీ టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఓఆర్‌ఎస్‌ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధి హమీ కార్మికులకు సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌ కుమార్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement