స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌ | - | Sakshi
Sakshi News home page

స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌ ఘనంగా భగీరథ మహర్షి జయంతి కలెక్టర్‌ను కలిసిన జిల్లా రెడ్‌క్రాస్‌ పాలకవర్గం 1 నుంచి క్రీడా శిబిరాలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో క్రికెటర్లకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ తెలిపారు. ఈమేరకు గురువారం రెడీమేడ్‌ టర్ఫ్‌ పించ్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డీవైఎస్‌ఓ ప్రశాంత్‌ మాట్లాడుతూ.. డీఎస్‌ఏ క్రికెట్‌ కోచ్‌ మహ్మద్‌ అఫ్జల్‌ ప్రత్యేక చొరవ, కృషితో సుమారు రూ.28 వేల విలువైన ఆస్ట్రో టర్ఫ్‌ పిచ్‌ను మీరట్‌ నుంచి తెప్పించినట్లు తెలిపారు.

హన్మకొండ అర్బన్‌: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్‌లో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, తదితరులు పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ స్వామి, జిల్లా సగర సంఘం నాయకులు నలుబోల సతీశ్‌, సీతా కమలాకర్‌ రావు, నెక్కొండ కిషన్‌, వడ్లకొండ కుమారస్వామి, గాండ్ల స్రవంతి, తాడిశెట్టి విద్యాసాగర్‌, అయోధ్య మంగనూరి రఘు, కోడిపాక గణేశ్‌ కుమార్‌, కానిగంటి రవి తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ కలెక్టర్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు చాహత్‌ బాజ్‌పాయ్‌ని గురువారం జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌తోపాటు పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కలెక్టర్‌కు వివరించారు. అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవం, డైనింగ్‌ హాల్‌ భూమిపూజ, రెడ్‌క్రాస్‌ డే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.విజయ్‌ చందర్‌ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యులు ఈవీ. శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్‌, పొట్లపల్లి శ్రీనివాస్‌ రావు, బిళ్ల రమణారెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌ అర్బన్‌: మహా నగర వ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్‌, బల్దియా ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో ఇండోర్‌ స్టేడియంలో స్పోర్ట్స్‌ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌–26 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బల్దియా ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌, జూడో, క్యారమ్స్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌ యోగా క్రీడాంశాల్లో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4–10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జీడబ్ల్యూఎంసీ ఇండోర్‌ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 98499 09333, 97019 99651, 85229 95960, 90325 04143 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement