హన్మకొండ అర్బన్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి, మట్టి తరలింపు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తూ మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్‌తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ కలెక్టర్ సత్యశారద వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో పాల్గొని పలు సూచనలిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.రవి, వైవీ.గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగునీటి పారుదల సీఈ సుధీర్, ఎస్‌ఈ రాంప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకన్న, ఈఈ కిరణ్ కుమార్, డీఈఈ మధుసూదన్‌రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ్ పక్వాడ’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జీసీడీఓ సునీత, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ సుమలత, ఆయుష్ జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ మహేందర్ కుమార్, డీపీఎం డాక్టర్ భాను ప్రకాశ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుబీనా, డెమో అశోక్ రెడ్డి, మెప్మా డీఎంసీ రజిత రాణి, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్
అధికారులతో సమీక్ష


