రెండున్నరేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

రెండున్నరేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

రెండున్నరేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌

హన్మకొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండున్నరేళ్లుగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుస్తున్నాయని, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీర్తిని ఎవరూ తగ్గించలేరని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. గురువారం హనుమకొండ స్నేహనగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘోష్‌ కమిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు, రేవంత్‌ సర్కార్‌కు చెంపపెట్టు వంటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప సాగు, తాగు నీటి ప్రాజెక్టు అన్నారు. కాంగ్రెస్‌ కుట్రపూరితంగా కేసీఆర్‌ని బద్నామ్‌ చేసేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్‌ వేసి కేసీఆర్‌ను దోషిగా చూపాలని యత్నిస్తున్నారని, అయితే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. కేసులు కొట్లాటలు తమకు కొత్త కావని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ప్రజల తరఫున బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పోరాడుతోందన్నారు. నాయకులు మర్రి యాదవరెడ్డి, మధు, సోదా కిరణ్‌, సంకు నర్సింగ రావు, లోహిత రాజు, బొంగు అశోక్‌, జోరిక రమేశ్‌, పులి రజినీకాంత్‌, సుధాకర్‌రెడ్డి, రామ్మూర్తి, చిన్న, వెంకన్న పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు

దాస్యం వినయ్‌భాస్కర్‌

Advertisement
 
Advertisement
Advertisement