దేశానికి ఆదర్శం ముల్కనూరు సొసైటీ | - | Sakshi
Sakshi News home page

దేశానికి ఆదర్శం ముల్కనూరు సొసైటీ

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

దేశానికి ఆదర్శం ముల్కనూరు సొసైటీ

కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

భీమదేవరపల్లి: ముల్కనూరు సొసైటీ మోడల్‌ దేశవ్యాప్తంగా అమలు చేస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. ఆమె గురువారం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సొసైటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ముల్కనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం సొసైటీ పరిధి గోదాం, కాటన్‌ మిల్లు, రైస్‌ మిల్లు యూనిట్లను సందర్శించి కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు. ఈసందర్భంగా సొసైటీ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సొసైటీ నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, లాభాలపై కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి వివరించారు. సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ రవి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారి వాజీద్‌ అలీ, హనుమకొండ డీఎం మహేందర్‌, ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్‌ రాజేశ్‌, ఏఓ పద్మ, ఏఈఓలు, ముల్కనూరు సర్పంచ్‌ జాలి ప్రమోద్‌రెడ్డి, జనరల్‌ మేనేజర్‌ రాంరెడ్డి, ఏజీఎం సతీశ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement