కాకతీయుల కట్టడాలు అద్భుతం | - | Sakshi
Sakshi News home page

కాకతీయుల కట్టడాలు అద్భుతం

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

కాకతీయుల కట్టడాలు అద్భుతం తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలి

ఖిలా వరంగల్‌: కాకతీయుల కట్టడాల మహా అద్భుతంగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల సెక్షన్‌ ఆఫీసర్లు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్‌ మధ్యకోటను వారు సందర్శించారు. శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుష్‌మహల్‌, ఏకశిల గుట్ట, మట్టి, రాతికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్‌ రవి వివరించారు. కార్యక్రమంలో టూరిస్ట్‌ పోలీస్‌ అనంద్‌ శ్రీనివాస్‌ రెడ్డి, మిల్స్‌ కాలనీ పోలీసులు ఉన్నారు.

నగర మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌ అర్బన్‌ : నగర ప్రజలకు వేసవికాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని మేయర్‌ సుధారాణి.. ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం వరంగల్‌ దేశాయిపేట ఫిల్టర్‌బెడ్‌ను మేయర్‌ తనిఖీ చేశారు. నీటి లభ్యత, శుద్ధీకరణ, క్లోరినేషన్‌ తదితర అంశాలను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement