గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

– 8లోu గ్రేటర్‌లో రెచ్చిపోతున్న పిచ్చికుక్కలు

న్యూస్‌రీల్‌

మేల్కోకపోతే ముప్పే..

చెత్త నిర్వహణ లోపం

వరంగల్‌ విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిని

వెంబడిస్తున్న కుక్క

హనుమకొండ, వరంగల్‌, కాజీపేట ట్రైసిటీలోని సుభాష్‌నగర్‌, ఎన్‌యూఆర్‌ నగర్‌, మార్కెట్‌ ఏరియాతో పాటు నగరంలో సుమారు వంద చోట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) కార్యక్రమం సరైన స్థాయిలో అమలు కాకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. నిపుణులు చెబుతున్న ప్రకారం కనీసం 70 శాతం కుక్కలను స్టెరిలైజ్‌ చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుంది. దీంతో పాటు మాంసం దుకాణాల్లోని వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా చూడాలి. బల్దియా సిబ్బంది ఇంటింటా చెత్తను సేకరించాలని, నగర పాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కల నుంచి తమను రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో వీధికుక్కల సమస్య పెనుసవాలుగా మారింది. రోజురోజుకూ నమోదవుతున్న కుక్క కాట్ల కేసులు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. వరంగల్‌, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో సుమారు 55 వేల నుంచి 65 వేలకుపైగా స్ట్రే డాగ్స్‌(వీధి కుక్కలు) సంచరిస్తున్నాయి. రోజుకు 20 నుంచి 25 వరకు కుక్క కాట్ల కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) స్టెరిలైజేషన్‌, ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ (ఏబీసీ) వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నా.. ఆ మేరకు ఫలితాలు కనిపించట్లేదు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు నగర ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి.

చర్యలేవి?

2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 2,257 మంది కుక్కకాటుకు గురైనట్లు వరంగల్‌ ఎంజీఎం రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 600 మందికిపైగా కుక్కకాటుకు గురయ్యారు. కాగా, రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్‌ హోంకు తరలించాలని న్యాయస్థానాలు ఆదేశించినా బల్దియా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవట్లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్ర చికిత్సలు నిర్వహించడం, ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం సర్వసాధారణమైపోయింది.

కాపువాడలో జనావాసాల మధ్య

చెత్త కుప్ప వద్ద వీధి కుక్క

ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని

జనసంచారం

రోజుకు 20–25 మందికి కుక్కకాట్లు..

ఆస్పత్రుల చుట్టూ జనం

వీధి కుక్కల నియంత్రణలో

జీడబ్ల్యూఎంసీ విఫలం

రూ.కోట్లు ఖర్చవుతున్నా

కానరాని నియంత్రణ

కుక్కల నుంచి కాపాడాలని

నగర ప్రజల వేడుకోలు

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో కుక్కల బెడదకు ప్రధానంగా చెత్త నిర్వహణలో లోపాలే కారణం. ఓపెన్‌ డంపింగ్‌ యార్డులు, మాంసం వ్యర్థాలను వీధుల్లో పడేయడం వంటి వాటి వల్ల కుక్కల సంచారం పెరిగింది. నగరంలో చాలా ఏరియాల్లో నిత్యం చెత్తను తీసుకెళ్లే ఆటోలు రావట్లేదు. ఏం చేయాలో పాలుపోక చాలా మంది వీధి చివరన చెత్తను పడేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అటువైపుగా వెళ్తున్న వృద్ధులు, చిన్నపిల్లలను కరుస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement