సమన్వయంతో పనిచేయండి | - | Sakshi
Sakshi News home page

సమన్వయంతో పనిచేయండి

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

సమన్వయంతో పనిచేయండి

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

పరకాల: ప్రభుత్వ అధికారుల పని తీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందించడంలో గ్రామ పాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, వారి పనితీరును బట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పోలీసులను, ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు స్పష్టం చేసిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement