9 మంది ఎస్సైల బదిలీ | - | Sakshi
Sakshi News home page

9 మంది ఎస్సైల బదిలీ

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

హసన్‌పర్తి: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వివిధ పోలీస్‌స్టేషన్‌ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్న కుమార్‌ (సీసీఎస్‌, వరంగల్‌ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్‌ (నల్లబెల్లి నుంచి వీఆర్‌, వరంగల్‌), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్‌పూర్‌), ీసీహెచ్‌.రఘుపతి (ఘన్‌పూర్‌ నుంచి వీఆర్‌, వరంగల్‌), ఈ.నర్సింహారావు (ధర్మసాగర్‌ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్‌కుమార్‌ (ఎల్కతుర్తి నుంచి వీర్‌, వరంగల్‌), ఎ.శ్రీకాంత్‌ (వీఆర్‌, వరంగల్‌ నుంచి బచ్చన్నపేట), ఎస్‌కే హమీద్‌ (బచ్చన్నపేట నుంచి వీఆర్‌, వరంగల్‌), బి.మంగ (వీఆర్‌, వరంగల్‌ నుంచి ట్రాఫిక్‌ కాజీపేట)కు బదిలీ అయ్యారు.

ఇద్దరిపై వేటు..

ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్‌కుమార్‌కు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయనను వీఆర్‌కు అటాచ్‌ చేశారు. బుధవారం బదిలీల్లో భాగంగా ఆయనకు వీఆర్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ చేసిన మరుక్షణమే ప్రవీణ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. అదేవిధంగా నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్‌ వేటు వేస్తూ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement