నెక్కొండలో వానరాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

నెక్కొండలో వానరాలకు చెక్‌

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

ఎలుగుబంటి వస్త్రాలను ధరించిన సిబ్బంది

గ్రామం నుంచి పరుగులు పెట్టిన కోతులు

నెక్కొండ: కోతుల బెడద నివారించాలని నెక్కొండ మేజర్‌ గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. గ్రామస్తులు, పంట చేళ్లను వానరాల బెడదను రక్షించాలని సర్పంచ్‌ పెండ్యాల హరిప్రసాద్‌ వినూత్న రీతిలో ఆలోచన చేశారు. ఇందుకోసం రూ.10 వేలతో మూడు ఎలుగుబంటి వస్త్రాలను కొనుగోలు చేశారు. బుధవారం జీపీ సిబ్బంది ఎలుగుబంటి వేషధారణతో గ్రామంలో తిరిగారు. వీరిని చూసిన వానరాలు పరుగు తీశాయి. ఈ సందర్భంగా సర్పంచ్‌ హరిప్రసాద్‌ మాట్లాడుతూ కోతులను పట్టించాలంటే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుండడంతో ఎలుగుబంటి దుస్తులు కొనుగోలుచేసి తీసుకొచ్చామని తెలిపారు. మా ప్రయత్నం సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈఓ సదానందం, ఉప సర్పంచ్‌ సింగం శ్రావణి–ప్రశాంత్‌, వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement