కాళోజీ సెంటర్: సహజవనరులను వినియోగించుకుని పర్యావరణాన్ని పరిక్షించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్‌డేను పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో తెలంగాణ నేషనల్ గ్రీన్‌క్రాప్స్ వారి పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమిని సంరక్షించడంలో పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ 50 మొక్కలు నాటాలని కోరారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ బి.రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు రావొద్దు..
న్యూశాయంపేట: వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లాలోని అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని మున్సిపల్, ఇరిగేషన్, రూరల్ వాటర్ సప్లయీస్ అధికారులకు సూచించారు. వడదెబ్బ కేసులకు తక్షణ వైద్యసేవలు అందేలా వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


