నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

నూతన కార్యవర్గం ఎన్నిక

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

నూతన కార్యవర్గం ఎన్నిక పన్ను వసూళ్లలో వేగం పెంచాలి

కాశిబుగ్గ : తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (కేఎంసీ, వరంగల్‌ యూనిట్‌) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకతీయ వైద్య కళాశాలలోని అసోసియేషన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ రాంకుమార్‌ రెడ్డి తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్‌ అంబి శ్రీనివాస్‌, జనరల్‌ సెక్రటరీగా డాక్టర్‌ చిన్ని కృష్ణ, కోఽశాధికారిగా డాక్టర్‌ చాడ రమేశ్‌ ఎన్నికయ్యారు. అలాగే జనరల్‌ కౌన్సిల్‌ మెంబర్లుగా డాక్టర్‌ బి. త్రిలోక్‌ చందర్‌, సీహెచ్‌ మురళి, జె.సురేందర్‌, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌ పి.సమ్మయ్య, కె.మురళి, ఎస్‌.సునీల్‌ దత్‌, జాయింట్‌ సెక్రటరీలుగా డాక్టర్‌ పి.రవి, బి.సునిల్‌కుమార్‌, ఎల్‌. దివ్యశ్రీ, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లుగా డాక్టర్‌ బి.రమేష్‌చంద్ర, కె.రజని, మానస నరహరి, వి.మురళీక్షృష్ణ, పి.వాసుప్రకాశ్‌, ప్రసన్నకుమార్‌ ఎన్నికయ్యారు.

వరంగల్‌ అర్బన్‌: ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని మేయర్‌ గుండు సుధారాణి అదేశించారు. మంగళవారం మేయర్‌, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ కలిసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను రాయితీ, సేకరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ఐదు శాతం రాయితీని ప్రజలకు వివరించాలని కోరారు. అదనపు కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్‌, సమ్మయ్య, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు.

వేసవిలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి

వేసవిలో నీటిసరఫరాపై దృష్టిసారించాలని మేయర్‌ గుండు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి ఇంజనీరింగ్‌ అదికారులతో మేయర్‌ తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈఈలు రవికుమార్‌, మహేందర్‌, సంతోష్‌బాబు, మాదవి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement