వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయని సీపీ సన్‌ప్రీత్‌సింగ్ పేర్కొన్నారు. వరంగల్, జనగామ ఏ ఎస్పీలుగా పనిచేస్తూ పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తు న్న ఏఎస్పీలు, శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌ను మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. డీసీపీలు అంకిత్‌కుమార్, రాజమహేంద్రనాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హన్మకొండ: తెలంగాణ కేడర్‌కు చెందిన 2025 బ్యాచ్ ఐఏఏస్ ప్రొబేషనర్లకు ప్రభుత్వం జిల్లాలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐఏఎస్‌లను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇందులో భాగంగా సాయిశివానిని ప్రొబేషనరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా హనుమకొండ జిల్లాకు నియమించారు. వీరు 27 వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హన్మకొండ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అద్దె బస్సుల సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి మారిపల్లి రాంరెడ్డి తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్, అధ్యక్షుడు అబ్బ మధుకర్, సభ్యుడు కాటన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.


