భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం

హన్మకొండ కల్చరల్‌: కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన, ఆదిశంకరుల జయంతిని నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, నాగుర్ల వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షులు సురేశ్‌కుమార్‌, ఉపాధ్యక్షులు కురిమిల్ల రమేశ్‌, శ్రీరాముల రమేశ్‌, నరేందర్‌ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్‌ డైరెక్టర్లు విజయ్‌కుమార్‌, నర్సింహారావు, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్‌సింగ్‌ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పూజల్లో వరంగల్‌ జిల్లా వడ్డెరకులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గండికోట సంపత్‌, స్వప్న, మల్ల య్య, సరోజ, మహేష్‌, అనూష, కంది సురేష్‌, మేరి, వెంకటేశ్‌, కమల పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement