బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ
అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ
హన్మకొండ కల్చరల్ : ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యులు భారతీయ తత్వశాస్త్రంలోని అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహనీయులని వీరి ఉపదేశాలు హిందూ ధర్మంపై ప్రభావాన్ని చూపాయని బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం హనుమకొండ రాగన్న దర్వాజలోని బ్రాహ్మణభవన్‌లో బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సతీమణి నీలిమా జ్యోతిప్రజ్వలన చేసి ఆచార్యుల జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆదిశంకరులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల బోధనలను వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. అనంత రం ఆచార్యుల చిత్రపటాలతో బ్రాహ్మణభవన్ నుంచి చిన్నకొవెల వరకు శోభాయాత్ర నిర్వహించారు.


