సర్జికల్స్‌ టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్జికల్స్‌ టెన్షన్‌

Apr 22 2026 7:12 AM | Updated on Apr 22 2026 7:12 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

వరంగల్‌
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
ఎంజీఎం ఆస్పత్రికి

మౌలిక వసతులపై దృష్టి సారించండి

గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కోరారు.

సాక్షి, వరంగల్‌: ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలకు అవసరమైన ‘సర్జికల్స్‌’ కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత రెండేళ్లకు సంబంధించి రూ.రెండు కోట్ల బకాయిలు ఆయా సర్జికల్‌ సరఫరాదారులకు చెల్లించాల్సి ఉన్నా.. ఆరు నెలల క్రితం 25 శాతం చెల్లింపులు చేయడంతో ఆ తర్వాత మిగతా బిల్లులు వస్తాయన్న ఆశతో సర్జికల్‌ పరికరాలు ఎంజీఎంకు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి సర్జికల్‌ బిల్లు వస్తుందని, రాగానే చెల్లింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన సరఫరాదారులకు ఇంకా బిల్లులు రాకపోవడంతో అవసరమైన సర్జికల్‌ పరికరాలు అందివ్వడం కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో సర్జికల్‌ పరికరాలు సమయానికి అందుబాటులో లేక రోగులకు అందించే వైద్యసేవల్లో ఆలస్యం కనబడుతోంది. అయినా ఎంజీఎం వైద్యాధికారులు సర్జికల్‌ సరఫరాదారులను ఒప్పించడంతో ప్రస్తుత వైద్యసేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నా.. రానున్న రోజుల్లో ఇది రోగులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన కనబడుతోంది. అయితే రాష్ట్రంలోని సర్కారు ఆస్పత్రులకు 80 శాతం మందులను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేస్తుంది. 20 శాతం డీసెంట్రలైజ్డ్‌ బడ్జెట్‌ కింద ఆయా ఆస్పత్రుల నిధుల నుంచి ఔషధాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటికే సప్లయర్లు 20 శాతం ఔషధాలు అవసరాల కింద సర్జికల్స్‌ పరికరాలను సరఫరా చేయలేమని ఇప్పటికే లేఖలు పంపిన సంగతి తెలిసిందే.

శస్త్రచికిత్సలపై తీవ్ర ప్రభావం..

సర్జికల్‌ గ్లోవ్స్‌, బ్లేడ్స్‌, స్యూటర్స్‌, ఇంప్లాంట్స్‌, రిట్రాక్టర్లు, సక్షన్‌ ఆపరటస్‌, ఎలక్ట్రోకాటరీ, లాపరోస్కోపీ, సిరింజీలు, ఐవీ కాన్యులేలు, ఈసీజీ మెషీన్స్‌, నబలైజర్స్‌, ల్యాబ్‌ కెమికల్స్‌ వంటి ముఖ్యమైన పరికరాలు కొరత ఉంటే అది శస్త్రచికిత్సలపై ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిసార్లు అత్యవసర కేసుల్లో కూడా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఇవి రోగుల బంధువులే కొని తీసుకురావడం ద్వారా వారిపై ఆర్థిక భారం పడనుంది. ఈ సర్జికల్‌ పరికరాల లభ్యత తీవ్రరూపం దాలిస్తే ఆస్పత్రులకు రోగులు తగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఓవైపు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సర్జికల్‌ బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ మెడికల్‌ బిల్లుల చెల్లింపులు ఉదాసీనంగా ఉన్న సర్కార్‌.. ఇటీవల ఎంజీఎంకు రూ.రెండు కోట్లు ఇవ్వడంతో వాటిని ఆస్పత్రి అధికారులు ఆయా చెల్లింపుదారులకు చెల్లిస్తున్నారు. ఇదే మాదిరిగా సర్జికల్‌ బిల్లులు కూడా చెల్లించాలని ఆయా సరఫరాదారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

అత్యవసర వైద్యసేవలపై

ప్రభావం చూపే అవకాశం

వైద్యపరికరాలు అందుబాటులో లేక ఇబ్బందులు

ప్రస్తుతం మెడికల్‌ బిల్లులు క్లియరెన్స్‌తో కాస్త ఉపశమనం

మా బిల్లులు కూడా చెల్లించాలంటున్న సర్జికల్‌ సరఫరాదారులు

Advertisement
 
Advertisement
Advertisement